
రావణ దహనం
శోభాయాత్ర
శమీ పూజ
భిక్కనూరు మండలం కాచాపూర్‌లో దుర్గాదేవి శోభాయాత్ర
గాంధారిలో శమీ పూజ..
మద్నూర్‌లో రావణ దహనం..
జిల్లాలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయుధ, శమీపూజ నిర్వహించిన అనంతరం ఒకరికొకరు బంగారం (జమ్మి) ఇచ్చిపుచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
వైభవంగా కొనసాగిన శరన్నవరాత్రులు మహార్నవమితో ముగిశాయి. అమ్మవారి ప్రతిమలను మండపాల్లో ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజలు చేసిన భక్తులు భక్తిశ్రద్ధలతో తల్లిని సాగనంపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పర్వదినాన జిల్లాలోని పలు చోట్ల రావణ దహనాన్ని నిర్వహించారు. బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు.

రావణ దహనం

రావణ దహనం