
పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని తిమ్మాపూర్ పెద్దచెరువు కట్ట తాత్కాలిక నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా చెరువుకట్ట తెగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నారు. శుక్రవారం పనులను పరిశీలించిన డీఈ.. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయనవెంట సిబ్బంది ఉన్నారు.
‘సాగర్’కు తగ్గని వరద
● కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్) : పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రా జెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షా 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. 10 గేట్లను ఎత్తి 76,020 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి 1402.25 అడుగుల (14.07 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.
ఎస్సారెస్పీలోకి 800 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ప్ర స్తుత సంవత్సరం ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇంకా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 33 వరద గేట్ల ద్వారా లక్షా 75 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వారం రో జుల క్రితం ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తక్కువగా ఉన్నప్పటికి ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి భారీగా నీటిని వదిలిపెట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం భారీగా తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం పెంచడం కోసం అధికారులు అవుట్ ఫ్లోను తగ్గించారు. అలాగే ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
నేడు ఆర్‌ఎస్‌ఎస్
విజయ దశమి ఉత్సవం
కామారెడ్డి అర్బన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గాంధీ గంజ్ బస్తీ విజయ దశమి ఉత్సవాన్ని శనివారం ఉదయం 9గంటలకు నిర్వహించనున్నట్లు బస్తీ ప్రముఖ్ పబ్బ శ్రీ నివాస్, నగర కార్యవాహ కే శివరాజు శుక్రవారం తెలిపారు. అయ్యప్ప ఫంక్షన్ హాలు లో నిర్వహించనున్న ఉత్సవానికి వక్తగా ఇందూర్ విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంత సహబౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు.
రైల్వేస్టేషన్‌కు
హెగ్డేవార్ పేరు పెట్టాలి
సుభాష్‌నగర్ : నిజామాబాద్ రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ కేశవరావు బలిరామ్ పేరు పెట్టాలని ఆయన ముని మనవడు హెగ్డేవార్ దిలీప్ శాస్త్రి ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హెగ్డేవార్ పరివారానికి ప్రత్యేకత ఉందన్నారు. హెగ్డేవార్ పేరుతో ఇప్పటికే కందకుర్తిలో స్మృతి మందిరం నిర్మాణం కోసం తన తండ్రి హెగ్డేవార్ శ్రీరామశాస్త్రి ఆర్‌ఎస్‌ఎస్‌కు స్థలం ఇచ్చారన్నారు. అందులో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్‌కు హెగ్డేవార్ పేరు పెట్టాలని దిలీప్ శాస్త్రి కోరారు.

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి