
స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలి
కామారెడ్డి టౌన్ : అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయంలో శుక్రవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసే అవకాశం లేని వారు అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమన్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అన్నారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతారా, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలి