
అధర్మంపై ధర్మానిదే విజయం
● దసరా వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
● జాతీయ జెండా ఆవిష్కరణ
బాన్సువాడ : అధర్మంపై ఎప్పుడూ ధర్మమే విజయం సాధిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి పాత బాన్సువాడ చావిడి వద్ద జాతీయ జెండాను పోచారం ఆవిష్కరించారు. ఆర్య సమాజ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా మినీస్టేడియానికి చేరుకున్నారు. రావణ దహనం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నారు. దేవినవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారని అన్నారు. ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, కాసుల రోహిత్, నార్ల రవీందర్, కృష్ణరెడ్డి, ఎజాస్, శ్రీధర్, ఖలేక్, నాగులగామ వెంకన్న, నార్ల ఉదయ్, దాసరి శ్రీనివాస్, శివదయాళ్ వర్మ, గడుమల లింగం తదితరులు పాల్గొన్నారు.

అధర్మంపై ధర్మానిదే విజయం