
నిజాంసాగర్‌లోకి భారీ వరద
ఎస్సారెస్పీలోకి..
నిజాంసాగర్ : ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,13,552 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 19 వరద గేట్లను ఎత్తి 1,25,307 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
బాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి సోమవారం ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం రోజు 3.15 లక్షల క్యూసెక్కుల నీరు రాగా, అర్ధరాత్రి తరువాత 4.5 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ సోమవారం రాత్రి వరకు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 39 వరద గేట్ల ద్వారా 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆది వారం 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సోమవారం తగ్గించారు. కాకతీయ కాలు వ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వా రా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 581 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమ వారం రాత్రి 1,083.30 (54.7టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

నిజాంసాగర్‌లోకి భారీ వరద