
‘నిర్దేశిత ఆర్పీఎంలోనే వరికోతలు చేపట్టాలి’
కామారెడ్డి క్రైం : జిల్లాలోని హార్వెస్టర్ యజమానులు తమ హార్వెస్టర్లను నిర్దేశిత ఆర్పీఎంలో ఉంచి వరికోతలు చేపట్టాలని జిల్లా ర వాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో హా ర్వెస్టర్ యజమానులకు వరి కోతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హార్వెస్టర్‌ను నిర్దేశిత ఆర్పీ ఎంలో ఉంచితే పొల్లు రాకుండా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూ చించిన మేరకు ప్రాధాన్యత క్రమంలో వరి కోతలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.
మెట్ట పంటల పరిశోధన కేంద్రం సందర్శన
కామారెడ్డి టౌన్: పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రాన్ని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సందర్శించారు. కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్‌రెడ్డిలతో మాట్లాడి వ్యవసాయ పరిఽశోధనల గురించి తెలుసుకున్నారు. కామారెడ్డిలో చిరుధాన్యాల సాగుకు రైతులకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని వారిని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గుప్తా, ప్రకాష్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ కలెక్టర్‌గా రవితేజ
కామారెడ్డి టౌన్: జిల్లాకు శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌గా రవితేజ నియమితులయ్యారు. తాజా గా టీజీపీఎస్సీ గ్రూప్– 1 నుంచి నియామ కం అయిన ఆయన సోమవారం కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.
ఎనిమిదేళ్ల తరువాత జూనియర్
కళాశాలలకు నిధులు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లాలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎనిమిదేళ్ల తరువాత నిధులు రావడం గమనార్హం. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఆయా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ముఖ్యంగా నీటివసతి, మరమ్మతులు, నీటి పైపుల ఏర్పాటు, టాయిలెట్లకు మరమ్మతులు, డ్యూయల్ డెస్క్ వంటి పనులు చేపడతారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎక్కువ సమస్యలు ఉన్న కళాశాలలకు అవసరాన్ని బట్టి నిధులు మంజూరు చేస్తున్నారు.

‘నిర్దేశిత ఆర్పీఎంలోనే వరికోతలు చేపట్టాలి’

‘నిర్దేశిత ఆర్పీఎంలోనే వరికోతలు చేపట్టాలి’