
మేనత్త అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే..
● ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్..
● రోడ్డు పక్కన స్కూటీపై ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
● కోమట్‌పల్లి వాసి దుర్మరణం
డొంకేశ్వర్(ఆర్మూర్): మేనత్త అంత్యక్రియలు పూర్తిచేసిన కొద్దిసేపటికే అనుకోని ప్రమాదంలో అల్లుడు మరణించిన సంఘటన డొంకేశ్వర్ మండలం కోమట్‌పల్లిలో చోటు చేసుకుంది. కోమట్‌పల్లి గ్రామానికి చెందిన చీనోళ్ల రాజేంద్ర ప్రసాద్ (44) వ్య వసాయం చేస్తుంటాడు. ఆదివారం తన మేనత్త ఎర్రక్క చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు గ్రామంలోనే నిర్వహించారు. మేనత్త అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ ఇంటి బయట రోడ్డు పక్కన తన స్కూటీపై కూర్చున్నాడు. అదే సమయంలో నికాల్‌పూర్ నుంచి కోమట్‌పల్లి మీదుగా శాపూర్‌కు వెళ్తున్న ఓ టిప్పర్ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందుకు జరిగి స్కూటీపై ఉన్న రాజేంద్రప్రసాద్ పైకి వచ్చింది. ట్రాక్టర్ చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదాన్ని చూసిన వారంతా ఉలిక్కిపడ్డారు. మేనత్త చనిపోయిన రోజునే అల్లుడు కూడా మరణించడం అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు..
వేల్పూర్: వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ క మిటీ ఎదుట 63 నెంబర్ జాతీయ రహదారి పై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన అల్లకుంట దినేశ్(26) మరణించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. దినేశ్ అతని స్నేహితులు కార్తీక్, రాజ్‌కుమార్‌తో కలిసి డ్యూక్ బైక్‌పై లక్కోర నుంచి మోర్తాడ్ వైపు వెళ్తుండగా, వేల్పూర్ ఏఎంసీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో దినేశ్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్, రాజ్‌కుమార్‌లను చికి త్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన దినేశ్ సెలవుపై గత నెలలో ఇంటికి వచ్చాడు. తిరిగి గల్ఫ్ వెళ్లాల్సి ఉండగా ప్రమాదంలో చనిపోయాడు. మృతుడికి ఒక సోదరి ఉండగా, ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసెలా రోదించారు.

మేనత్త అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే..