
గ్రూపు–2 ఉద్యోగాలకు ఎంపిక
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బాజ సంతోష్ గ్రూపు–2 ఉద్యోగానికి ఎంపికై నట్లు ఆదివారం తెలిపారు. గ్రూపు–2 ఫలితాల్లో జేడబ్ల్యూసీఎస్, డబ్ల్యూఎస్‌సీ సెక్షన్‌లో ప్రొబిషన్ అధికారిగా ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. సంతోష్ ప్రస్తుతం దోమకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అలాగే మండలంలోని మోతె గ్రామానికి చెందిన పాతూరి సతీష్‌కుమార్ గ్రూపు–2 ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలిపారు. సతీష్‌కుమార్ ప్రస్తుతం లింగంపేట మండలం పొల్కంపేట తండాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గ్రూప్–2లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై నట్లు ఆయన తెలిపారు.
రామారెడ్డి: మండలంలోని గిద్ద గ్రామంలో ఓ పురాతన బావి ఉంది. ఈ బావిలో నీళ్లు ఎండాకాలంలో కూడా ఇంకిపోవు. ఈ బావి గ్రామంలో ఎంతో మందికి నీటి అవసరాలను తీరుస్తుంది. ఎండాకాలంలో ఈ బావి గ్రామస్తులకు వరప్రదాయినిగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. ఈ బావిలో స్థానికులు సుమారు 20 నుంచి 30 వరకు చిన్న మోటార్లను దింపేసి పైపుల ద్వారా ఇళ్లకు నీళ్లను సరఫరా చేసుకుంటున్నారు. బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు, పైప్‌లైన్లను అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఆదివారం సాక్షి క్లిక్‌మనిపించింది.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవం సందర్భంగా విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ్ ప్రతినిధులు ఆ యుద పూజ చేశారు. వక్తలు విద్యా భారతి, అ యాచితుల లక్ష్మణ్‌రావు, నరేందర్‌రెడ్డి, పటోళ్ల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ పంచ పరివర్తనను ప్రతి పౌరుడు పాటించాలన్నారు. స్వదేశీ అనేది అందరిలో దేశభక్తిగా పెంపొందాలని పిలుపు నిచ్చారు. సంఘ్ ప్రతినిధులు బొడ్డు శంకర్, కొమిరెడ్డి స్వామి, అంతిరెడ్డి, ఎల్లయ్య, తమ్మలి మోహన్ పాల్గొన్నారు.

గ్రూపు–2 ఉద్యోగాలకు ఎంపిక