
మహమ్మదీయకాలనీలో చోరీ
ఖలీల్‌వాడి: నగరంలోని మహమ్మదీయ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. మహమ్మద్ షకీర్ తన ఇంటికి తాళం వేసి రెండ్రోజుల క్రితం బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న కుటుంబీకులకు తాళం పగులగొట్టబడి కనిపించింది. అనుమానంతో పరిశీలించగా బెడ్రూంలో ఉన్న తులంన్నర బంగారం, 15 గ్రాముల వెండి, రూ.1.50 లక్షలు అపహరణకు గురైనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
సదాశివ నగర్ (ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దుండగులు బీరువాలను పగులగొట్టి వెండి, బంగారు వస్తువులు, నగదును ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్ కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.

మహమ్మదీయకాలనీలో చోరీ