
గొర్రెను చంపిన చిరుత?
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మేడిపల్లి, గౌరారం అటవీ ప్రాంతంతో మూడు రోజుల క్రితం చిరుతపులి గొర్రైపె దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మేడిపల్లి గ్రామానికి చెందిన కురమ సంతోష్ తన గొర్రెలను మేపడానికి అడవికి తీసుకెళ్లాడు. అయితే, ఇటీవలే కొనులుగోలు చేసిన విత్తన పొటేలు అడవిలో తప్పిపోయింది. రెండురోజుల క్రితం మేడిపల్లి శివారులో గొర్రె కళేబరం కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంతోష్ ఫిర్యాదు మేరకు ఫారెస్టు బీట్ అధికారి హన్మాండ్లు మరో అధికారితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా చేసి ఫారెస్టు సెక్షన్ అధికారి సునీతకు సమాచారం ఇచ్చారు. సెక్షన్ అధికారి సునీత పరిశీలించిపై అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అడవిలో గడ్డి ఏపుగా పెరిగినందున గొర్రైపె దాడి చేసింది ఏ జంతువో కచ్చితంగా చెప్పలేమన్నారు. వెటర్నరీ డాక్టర్ రిపోర్టు ఆధారంగా నిర్ధారణ చేస్తామన్నారు. గౌరారం, మేడిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతలున్నాయని, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.