
‘సాగర్’ 15 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు కౌలాస్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అలాగే జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సింగితం రిజర్వాయర్, నల్లవాగు మత్తడితోపాటు పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నాయి.
సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌లోకి శనివారం 1,09,470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 15 గేట్ల ద్వారా 1,10,702 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు.
కౌలాస్ ప్రాజెక్టు నుంచి..
కౌలాస్ ప్రాజెక్టులోకి 10,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 5 గేట్ల ద్వారా 12,522 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.