
క్రైం కార్నర్
కరెంట్‌షాక్‌తో బాలుడు మృతి
మాక్లూర్: తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్‌రెడ్డి అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలానికి వెళుతుండగా, కుమారుడు చింత అభినయ్ (15) తాను వస్తానని చెప్పడంతో అతడిని తీసుకువెళ్లాడు. ప్రవీణ్‌రెడ్డి పొలానికి నీరు పెడుతుండగా కొద్ది దూరంలో ఉన్న కుమారుడు కరెంట్ మోటార్ వద్దకు వచ్చాడు. దీంతో అభినయ్‌కు కరెంటువైర్లు తగిలి, షాక్‌తో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు కర్ర సాయంతో వైర్లను తీసివేసి, బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కానీ అభినయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నవీపేట: మండలంలోని బినోల గ్రామానికి చెందిన ముంత పోశెట్టి(56) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పోశెట్టి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం గడ్డి మందుతాగాడు. వెంటనే అతడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ సిటీ: నగరంలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుడు వాటర్‌ట్యాంక్ పైనుంచి పడి గాయపడ్డాడు. వివరాలు ఇలా.. మున్సిపల్ కార్పొరేషన్‌లోని జోన్–4 వాటర్ వర్క్స్ విభాగంలో బింగి మధు అనే వ్యక్తి ఔట్‌సోర్సింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో అతడు వాటర్ లెవల్ చెక్‌చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్యాంక్ పైనుంచి జారి కిందపడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తోటి కార్మికులు జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మధును మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ శనివారం ఉదయం పరామర్శించారు. వైద్య ఖర్చులను సంబంధిత ఏజెన్సీ భరిస్తుందని తెలిపారు.

క్రైం కార్నర్