
అందరూ నియమాలు పాటించాలి
● ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ గ్రామ వికాస్
సంయోజక్ కదిరె లక్ష్మారెడ్డి
దోమకొండ: మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ గ్రామ వికాస్ సంయోజక్ కదిరె లక్ష్మారెడ్డి అన్నారు. రాబోయే విజయదశమి నాటికి ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పైడిమర్రి ఫంక్షన్‌హాలులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శాఖ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఎవరికి వారు నియమాలు, నిబంధనలు పాటించాలన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని, మాతృభాషలో మాట్లాడాలని చెప్పారు. అందరం సమానమనే భావనతో మెలగాలని హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు కదిరె మోహన్‌రెడ్డి, సుంచు రాములు, భూపాల్ లక్ష్మణ్, సిద్దరామలు, రిటైర్డు ఆర్మీ జవాన్ కిష్టారెడ్డి, డాక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.