
ఆ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్
● కాని గ్రామంలో ఒక్కరు కూడా ఎస్టీలు లేరు
నస్రుల్లాబాద్: అవును మీరు విన్నది నిజమే. గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎస్టీకి లేదు. కాని ఆ గ్రామ ప్రథమ పౌరుడిగా మాత్రం ఎస్టీకి అధికారుల రిజర్వు చేశారు. దీనితో గ్రామ ప్రజల్లో గందరగోళం నెలకొంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్‌లో సర్పంచ్ పదవికి నిలబడడానికి ఏ ఒక్క అభ్యర్థి లేరని.. పక్క గ్రామం నుంచి అరువు తెచ్చుకుందాం అంటూ సైటెర్లు వేసుకుంటున్నారు. అధికారుల పని తీరుకు ఈ రిజర్వేషన్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంత కాలం సర్పంచ్‌గా పోటీ చేయాలన్న ఆశావహులకు మాత్రం నిరాశ ఎదురైంది. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని గ్రామ ప్రజలు చెబుతున్నారు.
మాచారెడ్డి: పాల్వంచ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కూచని శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కోడూరి అంజనేయులు, ఉపాధ్యక్షులుగా నరహరి, రాంచంద్రం, రామకృష్ణ కోశాధికారిగా ల క్ష్మణ్ , సహాయ కార్యదర్శులుగా నర్సింలు, దయా కర్, సలహాదారులుగా రాంచంద్రం బాల్‌రాజు, దశరథం, శ్రీనివాస్, రవీందర్‌లు ఎన్నికయ్యారు.
లలితా త్రిపుర సుందరి ఆలయ వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్: స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయ 8వ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు లలితా హవనం జరిపించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌గుప్తా, దామోదర్, కె.ప్రభావతి, కాలనీ మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం చేశారు.
బీసీ కులగణన
వివరాలు తెలపాలి
సుభాష్‌నగర్: రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తరపున పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే బీసీ కులగణన నివేదిక వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వివరాలు ప్రజలకు తెలిస్తేనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సమానత్వంతో అమలు చేయనున్నారో తెలుస్తోందన్నారు.

ఆ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్

ఆ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్