
కొలిక్కి వస్తున్న రిజర్వేషన్లు!
ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు..
పచ్చని తివాచీ..
● నేటి సాయంత్రం వరకు పూర్తయ్యే చాన్స్
● పల్లె పోరుకు సిద్ధమైన యంత్రాంగం
● సీఎస్ ఆదేశాలతో వేగంగా పనులు
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్
● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
వరుణుడు కరుణించాడు.. జలసిరులు కురిపించాడు.. దీంతో పుడమి పులకరించింది.. పచ్చందాలను సంతరించుకుంది.. ప్రస్తుతం కనుచూపు మేరంతా భూమి పచ్చని పంటలతో కళకళలాడుతూ కనువిందు చేస్తోంది.
సదాశివనగర్ మండలం మల్లన్నగుట్టపై నుంచి కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తు ముమ్మరం చేసింది. అధికారులంతా సోమవారం ఇదే పనిలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు కానుండగా, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ, 25 ఎంపీపీ పదవులతో పాటు 233 ఎంపీటీసీ స్థానాలకు అలాగే 532 గ్రామల సర్పంచ్, 4,656 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలకు 4,670 పీఎస్‌లు..
జిల్లాలో మొత్తం ఓటర్లు 6,39,730 మంది ఉండగా.. ఇందులో 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతో పాటు 4,656 వార్డులకు జరిగే ఎన్నికల కోసం 4,670 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో గిరిజన ఓటర్లే ఉన్న పంచాయతీలన్నీ సర్పంచ్‌తో పాటు, వార్డు సభ్యుల స్థానాలు గిరిజనులకే కేటాయిస్తారు. అవి పోను మిగతా వాటిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
ప్రాదేశిక స్థానాలకు 1,259 పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలోని 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే అవసరమైన సిబ్బందిని కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ వెలువడగానే మిగతా పనులన్నీ కొలిక్కిరానున్నాయి.
ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవు తుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని టెన్షన్‌తో ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజ ర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మంగళవారం సాయంత్రంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
యంత్రాంగం బిజీబిజీ...
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వ హణ ఏర్పాట్లలో బిజీ అయ్యింది. ఇప్పటికే ఓటరు జాబితా లను సిద్ధం చేసిన అధికారులు.. రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. మంగళవారం సాయంత్రంలోపు రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జనాభా, ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల శాతం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నారు.

కొలిక్కి వస్తున్న రిజర్వేషన్లు!