
వరద బాధితుల కోసం పీఆర్టీయూ విరాళం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం 7,06,011 రూపాయల విరాళాన్ని సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు అందించినట్లు పీఆర్టీయూ ప్రతినిధులు తెలిపారు. సామాజిక బాధ్యతగా జిల్లా శాఖ తరఫున ఈ విరాళం అందించామని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గర్ధాస్ గోవర్ధన్ పేర్కొన్నారు. పీఆర్టీయూ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్టీయూ నాయకులు మధుసూదన్‌రెడ్డి, సంగారెడ్డి, హన్మాండ్లు, రమణ, రామచంద్రరెడ్డి, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆయుర్వేద
వైద్యశిబిరం
కామారెడ్డి అర్బన్: జాతీయ ఆయుర్వేద ది నోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్ జి ల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలి పారు. ఎన్జీవోస్ కాలనీలోని శ్రీలలి త త్రిపు ర సుందరి ఆలయం సమీపంలోగల హోమి యో ఆస్పత్రి వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కామారెడ్డి ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు
స్వీకరించిన దినేశ్
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా దినేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఖమ్మం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో కామారెడ్డి డీఎంగా పనిచేసిన కరుణశ్రీ హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా దినేశ్ గతంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో సీఐగా పనిచేశారు. దీంతో ఆయనకు డిపోపై పూర్తి అవగాహన ఉంది.
30 వరకు టీజీవో బతుకమ్మ సంబురాలు
కామారెడ్డి అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీజీవో) ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేందర్, సాయిరెడ్డి తెలిపారు. సోమవారం బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయా శాఖల్లోని మహిళా ఉద్యోగులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీవో ప్రతినిధులు భూమయ్య, రాజలింగం, సంతోష్‌కుమార్, జ్యోతి, తురబుద్దీన్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితుల కోసం పీఆర్టీయూ విరాళం

వరద బాధితుల కోసం పీఆర్టీయూ విరాళం