
‘ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి’
రాజంపేట : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి ప రిష్కారం చూపాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించా రు. సోమవారం ఆయన రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. రోల్ కాల్‌ను పరిశీలించి హాజరై న, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించు కోవడం, రోల్ కాల్ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బా ధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. బ్లూ కో ల్ట్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చే యాలని రాజంపేట పోలీస్ సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, భిక్కనూరు సీఐ సంపత్ ఉన్నారు.