
ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి
పిట్లం(జుక్కల్): నిజామాబాద్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న మార్కెట్ హమాలీ, దడ్వాయి స్లీపర్ల ఏఐటీయూసీ రాష్ట్ర రెండో మహాసభలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుర్రెం బాల్ రాజ్ కోరారు. ఆయన మంగళవారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ, సభ్యులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: బోర్లంక్యాంపు తండాలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు గ్రామస్తులతో కలిసి టోర్నమెంట్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంట్రీ ఫీజు రూ.800 చెల్లించి ఈనెల 25లోగా జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టౌర్నీలో విజేతలకు రూ.20వేలు, రన్నరప్‌కు రూ.10వేల నగదుతో పాటు ట్రోఫీలు అందజేస్తామన్నారు. టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ధారవత్ రవి, తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 77026 27567, 99085 50202కు సంప్రదించాలన్నారు.

ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి