
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి ఇటీవల నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెయ్యి కోసుకొని తమతో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు తమ విధులకు ఆటంకం కలిగించాడని ఎస్సై తెలిపారు. అలాగే మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు గంగారాజు ఇటీవల మద్యం తాగి తన ఇంటిముందర విద్యుత్ స్తంభం లేదని చెబుతూ సెల్‌టవర్ ఎక్కి డయల్ 100కు కాల్‌చేస్తూ, పోలీసులను దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించాడన్నారు. దీంతో యాదగిరి, గంగారాజుపై కేసులు నమోదుచేసి అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
మాచారెడ్డి: మండలంలోని ఘన్‌పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై వాహనం నిలిచిపోయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్‌ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.