
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల్ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్‌పల్లికి చెందిన తాటికొండ పురుషోత్తం(59) సోమవారం కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం నిర్మల్‌కు వెళ్లాడు. మంగళవారం వేకువజామున తిరిగి మెట్‌పల్లికి అదే కారులో బయలుదేరారు. మోర్తాడ్ వద్ద కారు డ్రైవర్ శేఖర్ హైవేపై ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్‌ను గమనించకపోవడంతో వేగంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. గాయాలైన డ్రైవర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పురుషోత్తం భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి