
ఫాగింగ్... పరేషాన్..!
దోమల స్వైరవిహారం..
ఆదేశాలు జారీచేస్తాం
బాన్సువాడ రూరల్: దోమకాటుతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల నివారణకు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ మెషిన్లు చాలా పంచాయతీల్లో చెడిపోగా మరికొన్ని చోట్ల మిషన్లను వినియోగించడం లేదు. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతర వైరల్ జ్వరాలు తాండవం చేస్తున్నాయి. గత ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.35 వేల నుంచి 40 వేలు వెచ్చించి ఫాగింగ్ మెషీన్‌లను కొనుగోలు చేసింది. కొన్ని మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులతో పంచాయతీ కార్యదర్శులు ఫాగింగ్ చేయిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో యంత్రాలు చెడిపోవడంతో పక్కనున్న పంచాయతీల నుంచి తీసుకుని రావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు సూచనలు చేసినప్పటికీ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోల్, లిక్విడ్‌లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.
ఖర్చు తడిసి మోపెడు..
మండలంలోని చాలా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులు చేయించలేక మూలన పడేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఒక్కో మేజర్ పంచాయతీలో ఒకసారి ఫాగింగ్ చేయించాలంటే రూ.7 వేల నుంచి 10 వేలు ఖర్చవుతాయి. ఇప్పటికే ఒక్కో కార్యదర్శి రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు అప్పుల పాలై అభివృద్ధి పనులు చేయించారు. గ్రామాల్లో ఫాగింగ్ చేయకపోతే దోమలు పెరుగుతాయి.. చేస్తే పంచాయతీ కార్యదర్శులకు అప్పులు పెరుగుతున్నాయని వాపోతున్నారు.
గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేపట్టాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్ కావడంతో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసినప్పుడే దోమలను సగం వరకు నియంత్రణ చేయవచ్చు. గ్రామం మొత్తంగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదు. ఒకసారి పిచికారి చేయించిన ఫొటోలనే మార్చి మార్చి ప్రతినెలా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దోమకాటుకు పల్లెలు విలవిల
మూలన పడిన యంత్రాలు
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఫాగింగ్ చేస్తే అప్పులు..చేయకుంటే దోమలు పెరుగుతున్నాయంటున్న
కార్యదర్శులు
ప్రతి గ్రామంలో దోమల నివారణ కోసం మందును పిచికారీ చేయాలని కార్యదర్శులకు సూచనలు ఇచ్చాం. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ మిషన్లు పాడైనట్లు కార్యదర్శులు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
– సత్యనారాయణరెడ్డి, డీఎల్‌పీవో, బాన్సువాడ