కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఈ నెల 18 వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటగా ఈ నెల 15 వరకు చివరి తేదీ అని ప్రకటించగా మరో మూడు రోజులు రేషన్ పంపిణీ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ఎర్రాపహాడ్‌వాసికి సినారె గజల్ పురస్కారం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన కవి కౌడి రవీందర్ సినారె గజల్ పురస్కారం అందుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం రవీందర్ హైదరాబాద్‌లో కొమ ర్రాజు ఫౌండేషన్ సంస్థ ఆధ్యర్యంలో నిర్వహించిన త్యాగరాయ గాన సభలో పాల్గొని పాట లు, కవిత్వం రాశారు.నైపుణ్యం గర్తించి రవీందర్‌కు సినారె గజల్ పురస్కారాన్ని అందజేశారు.
నేడు ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపిక
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పేట్‌సంగెం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం జోనల్ స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని ఎంఈవో శ్రీహరి, పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ సోమవారం ఓ ప్రకటననలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఒక్కో విభాగం నుంచి ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వారు వెల్లడించారు.
బాలాజీ జెండా వద్ద అన్నదానం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో కొలువుదీరిన తిరుమల తిరుపతి బాలాజీ జెండా వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సోమవారం నిర్వాహకులు డాక్టర్ రమణ తెలిపారు. మధ్యాహ్నం బాలాజీ జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే బుధ, గురువారం రెండు రోజుల పాటు ఈ సారి మండల కేంద్రంలో బాలాజీ జెండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ–పంచాయతీ ఆపరేటర్ సోమిరెడ్డికి నివాళి
రాజంపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఈ–పంచాయతీ ఆపరేటర్‌గా నిధులు నిర్వహిస్తున్న సోమిరెడ్డి ఈ నెల 12 రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవడంపై మండల ఈ–పంచాయతీ ఆపరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల పరిషత్ కా ర్యాలయంలో సోమిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రఘురాం, ఆపరేటర్లు చంద్రప్రసాద్, ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.