
షార్ట్‌సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా.. గోసంగి కాలనీలో సల్ల భాగ్య, తురపాటి సాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాత సా మాన్ల కొనుగోలు వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో వారు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సల్ల భాగ్య ఇంట్లో విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కన ఉన్న తూరపాటి సాయమ్మ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే రెండు ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి. సల్ల భాగ్య ఇంట్లో తులం బంగారం, వెండి ఆభరణాలు, రూ.3లక్షల నగదు కాలిపోగా, తూరపాటి సాయమ్మ ఇంట్లో కొంత నగదుతోపాటు వంట సామగ్రి, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయాయి. సుమారు రెండు ఇళ్లల్లో కలిపి సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధి తులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వంట సామగ్రి, దుస్తులను అందజేశారు.