
కళాశాలకు ప్రొజెక్టర్ అందజేత
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ముగ్గురు సీఐలు కలిసి ప్రాజెక్టర్‌ను అందజేశారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో బాన్సువాడ పట్టణానికి చెందిన చతుర్వేది అభినవ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్), సంజీవ్ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్), సాజిద్(జోనల్ ఇన్‌స్పెక్టర్, నిజామాబాద్)లు కలిసి రూ.30 వేలు విలువ గల ప్రొజెక్టర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ శివకుమార్, అధ్యాపకులు ఉన్నారు.