
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఇందల్వాయి/ఖలీల్‌వాడి: ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే లైనును ఓ వ్యక్తి దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలను అతడు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనారోగ్యంతో శతాధిక వృద్ధురాలు..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సామల నర్సవ్వ(103) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సవ్వ వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా తన పనులు తాను చేసుకునేదని పేర్కొన్నారు. నర్సవ్వ మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి