పారిశుద్ధ్యం అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

Sep 15 2025 8:23 AM | Updated on Sep 15 2025 8:23 AM

పారిశ

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

అవగాహన పెంచడంలో విఫలం..

బిచ్కుంద(జుక్కల్‌): పల్లెల నుంచి పట్టణం వరకు విషజ్వరాలు విజృంభించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు జ్వర పీడితులున్నారు. కురిసిన వర్షాల వల్ల బిచ్కుందలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాల్‌ అధికారులు పారిశుద్ధ్యంపై అంతగా దృష్టిసారించకపోవడంతో ఆయా వార్డులలో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఎటుచూసినా ఇళ్ల నివాసాల మధ్య మోకాళ్ల వరకు వరద, మురికి నీరు ఆగి ఉన్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు, పట్టణంలో మున్సిపల్‌ అధికారులు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య లోపాన్ని నిర్మూలించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దోమలకు మురికి ప్రాంతాలు ఆవాసాలుగా మారుతున్నాయి. వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వివిధ వ్యాధులు, జ్వరాల బారినపడుతున్నారు. రోజురోజుకు ఆస్పత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య పెరుగుతోంది.

డెంగీ కేసులతో ఆందోళన..

జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జులై, ఆగ స్టు నెలల్లో 59 డెంగీ కేసులు నమోదయ్యాయి. బి చ్కుందలో 2 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. హ జ్గుల్‌లో 12 ఏళ్ల బాలునికి, బిచ్కుందలో ఓ మహిళకు డెంగీ బారినపడి బిచ్కుంద, బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం చికిత్స పొందారు. ఇంటి పరిసరాలలో ఆగిన మురికి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. డెంగీ కేసులు పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నా వైద్య అరోగ్య శాఖ, మున్సిపల్‌ అధికారులు చోద్యంచూస్తున్నారు.

నిధుల కొరతతో పనుల్లో జాప్యం..

బిచ్కుంద మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి మోటార్లు, వీధి లైట్లు, కార్మికులు వేతనాలకు ఇచ్చి పనులు చేస్తున్నట్లు జీపీ అధికారులు అంటున్నారు. జీపీ నిర్వహణకు ప్రభుత్వం చిల్లి గవ్వ నిధులు ఇవ్వలేదు.. పనులు చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. బిచ్కుంద కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగైదు నెలల కావస్తుంది..కానీ ఇప్పటి వరకు నిధులు రాలేదు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉందని పనులు చేపట్టడానికి వార్డు ఆఫీసర్లు వెనకడుగు వేస్తున్నారు. ఇకనైనా కలెక్టర్‌ స్పందించి జీపీలు, మున్సిపాలిటీకి నిధులు వచ్చే విధంగా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఇళ్లల్లోని తొట్టెలలో నిలువ నీటి పారబోత, ఇంటి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వైద్య, మున్సిపల్‌, పంచాయతీ శాఖల అధికారులు బిచ్కుంద మండలంలో విఫలమయ్యారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నట్లు ఎక్కడా ఆనవాళ్లు కనపడటం లేదు. ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం చేపట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది, జీపీ అధికారులు పత్తాలేకుండా పోయారు. విషజ్వరాల గుర్తింపు.. తూతుమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై పారుతున్న మురికి నీరు

జిల్లాలో రెండు నెలల్లో

59 డెంగీ కేసులు

బిచ్కుందలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ

ప్రబలుతున్న విషజ్వరాలు..

ఆందోళనలో ప్రజలు

చోద్యం చూస్తున్న మున్సిపల్‌,

వైద్య శాఖాధికారులు

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం1
1/1

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement