తల్లిని చంపిన కొడుకు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

Sep 15 2025 8:23 AM | Updated on Sep 15 2025 8:23 AM

తల్లి

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

తల్లిని చంపిన కొడుకు అరెస్టు యూరియా కొరత రాకుండా చర్యలు ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక భజనలు

బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్‌ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్‌తో కలిసి సాయవ్వను బైక్‌పై ఎక్కించుకొని బోలక్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్‌ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్‌ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్‌ను, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్‌కు తరలించామని, మైనర్‌ను జువైనల్‌ అబ్జర్వేషన్‌ హోంకు తరలించామని అన్నారు.

దోమకొండ: నియోజకవర్గంలో యూరియా కొరత రాకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తెలిపినట్లు మాజీ సీడీసీ చైర్మన్‌ ఐరేని నర్సయ్య తెలిపారు. ఆదివారం షబ్బీర్‌అలీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలువగా, సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై బీబీపేట ఎస్సైతో పాటు పార్టీ నాయకులు, అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు గెలిచేలా కృషి చేయాలని సూచించారని అన్నారు.

దోమకొండ: మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సందెల అబ్బయ్య, సిద్దరాములు, రంజిత్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ నల్లపు అంజలి, మాజీ ఎంపీపీ కానుగంటి శారద, భక్తులు పాల్గొన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరి మాత ఆశ్రమంలో శనివారం రాత్రి భక్తులు భగవన్నామ సంకీర్తనలతో ప్రత్యేక భజనలు చేశారు. అలాగే ఆలయం ప్రాంగణంలోని వెంకటేశ్వర, దత్తాత్రేయ, మార్కండేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈయేడాది పంటలు బాగా పండాలని దేవతామూర్తులను వేడుకున్నారు. రెండో శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

తల్లిని చంపిన కొడుకు అరెస్టు
1
1/4

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

తల్లిని చంపిన కొడుకు అరెస్టు
2
2/4

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

తల్లిని చంపిన కొడుకు అరెస్టు
3
3/4

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

తల్లిని చంపిన కొడుకు అరెస్టు
4
4/4

తల్లిని చంపిన కొడుకు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement