వానర మూక స్వైర విహారం పెద్ద చెరువు కట్ట తాత్కాలిక నిర్మాణ పనులు ప్రారంభం బతుకమ్మ సంబురాలు
రామారెడ్డి: వానరమూక రోడ్డుపై తిష్ట వేసి రోడ్డుపై వెళ్లే వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట మర్రి నుంచి రెడ్డిపేట ఎల్లమ్మ గుడి వరకు కిలోమీటర్ దూరం వరకు వానరమూక గుంపులు గుంపులుగా ఆదివారం హల్‌చల్ చేశాయి. ఆ వానరమూకను అక్కడి నుంచి తరలించడం ఎవరికీ సాధ్యం కాకపోవడంతో చుట్టుపక్కల రైతులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై వానర మూకలను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ పెద్ద చెరువు కట్ట తాత్కాలిక పనులను ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగిపోవడంతో కట్ట నిర్మాణ పనులను తాత్కాలికంగా జరుపుతున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పంటలు ఎండకుండా వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా ఉండేందుకు పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. బతుకమ్మ పండుగలో భాగంగా హాస్టల్‌లో బాలికలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వార్డెన్ విజయశాంతి, బాలికలు తదితరులున్నారు.

వానర మూక స్వైర విహారం