
సంస్కారాన్ని నేర్పుతున్న శిశుమందిరాలు
● ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి,
మదన్‌మోహన్‌రావు
● ముగిసిన రాష్ట్రస్థాయి
గణిత విజ్ఞాన మేళా
కామారెడ్డి అర్బన్: నైతిక విలువలు కనిపించకుండా పోతున్న ప్రస్తుత సమాజంలో చదువుతో పాటు సంస్కారం నేర్పుతున్న శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలల్లో చదువుకోవడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలని కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. శ్రీసరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో కామారెడ్డిలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్‌లో శుక్రవారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి గణిత సాంస్కృతిక విజ్ఞాన మేళా ఆదివారం ముగిసింది. ముగింపు సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికత నుంచి మంచిని మాత్రమే తీసుకోవాలని, భారతీయులందరు తన కుటుంబ సభ్యులేననే జాతీయ భావన ప్రతి ఒక్కరిలో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. విద్య, నిజాయితీ, వ్యక్తిత్వం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. మానవ జీవితంతో గణితం, సైన్స్ విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని ముఖ్యవక్త అర్ధచంద్ర ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన మేళా విజేతలకు బహుమతులు అందించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్‌మోహన్‌రావులను సన్మానించారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఒకే వేదికపై సన్మానించడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, శ్రీసరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌రావు, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు కృష్ణమాచార్యులు, హరిస్మరణ్‌రెడ్డి, గీరెడ్డి రాజారెడ్డి, రంజిత్‌మోహన్, మల్లేష్‌యాదవ్, ప్రధానాచార్యులు నాగభూషణం, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కారాన్ని నేర్పుతున్న శిశుమందిరాలు