
సహాయక చర్యల్లో ఆర్డీవో వీణ...
న్యూస్‌రీల్
సహాయక చర్యల్లో హిమబిందు
చెరువు వద్ద జాగారం చేసిన ఏఈ రవళిక
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
– 8లో u
వానొస్తుందని ఇంట్లోనే ఉండిపోలేదు. ఎదురైన విపత్తును చూసి వెనుకంజ వేయలేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రమాదకర పరిస్థితుల్లోనూ పర్యటించారు. బాధితులకు మేమున్నామన్న భరోసా ఇచ్చారు. ఆపద నుంచి ప్రజలను కాపాడేందుకు శ్రమించారు. విపత్కర పరిస్థితుల్లోనూ వెన్నుచూపని ఆ ధీర వనితలు.. విధి నిర్వహణలో తమ అంకితభావంతో ఆదర్శంగా నిలిచారు.
కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్‌లో ఏఎస్పీ చైతన్యరెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వణికించాయి. వినాయక చవితి పండుగ రోజున ఒక్కసారిగా దంచికొట్టిన వాన జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. అలాగే వివిధ మండలాల్లో వాగులు పొంగి ప్రవహించి రోడ్లు కొట్టుకుపోయి ఊళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, నదుల్లో ఎందరో చిక్కుకుపోయారు. అలాంటి సమయంలో ప్రజలను ఆదుకునేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రలతోపాటు జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. కలెక్టర్, ఎస్పీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతో చాలావరకు వరదల్లో చిక్కుకున్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరగలిగారు. ఈ క్రమంలో మహిళా అధికారులు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. వారు వారం రోజులుగా రేయింబవళ్లు బాధ్యతగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, పోలీసు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది వరదలు సృష్టించిన విపత్తును ఎదుర్కొనడంలో ఎవరి స్థాయిలో వారు శ్రమించారు. పండుగ పూట కూడా విధుల్లో కొనసాగారు. వ్యవసాయ శాఖలోని మహిళా ఉద్యోగులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, పంటలను పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలందించారు. వర్షాల అనంతరం పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలూ వెలకట్టలేనివి.
బీబీపేట చెరువు వద్ద రెస్క్యూ
ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న కామారెడ్డి ఆర్డీవో వీణ
పాల్వంచ వాగు వద్ద రెస్క్యూ
బృందంతో తహసీల్దార్
హిమబిందు
గాంధారి చెరువు అలుగు వద్ద రెస్క్యూ బృందంతో తహసీల్దార్ రేణుకా చౌహాన్
పాల్వంచ తహసీల్దార్ హిమబిందు వరద సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. పాల్వంచ వాగులో చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను కాపాడడానికి ఆమె వేగంగా స్పందించి రెస్క్యూ టీంను రప్పించారు. సకాలంలో సాయం అందడంతో ఇద్దరు రైతులు సురక్షితంగా బయటకు రాగలిగారు. మండలంలో ఇతర సహాయక చర్యల్లోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు.
వరద ప్రభావిత
ప్రాంతాల్లో ధైర్యంగా
విధి నిర్వహణ
విపత్తు నుంచి ప్రజలను
కాపాడేందుకు శ్రమించిన పలువురు
మహిళా అధికారుల
సేవలను ప్రశంసిస్తున్న
ప్రజలు
కామారెడ్డి ఆర్డీవో వీణ డివిజన్‌లోని ఆయా మండలాల్లో వరద సహాయక చర్యల్లో శ్రమించారు. పట్టణ పరిధిలోని పలు కాలనీలతో పాటు వివిధ మండలాల్లో వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేయడంతో పాటు వారికి ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
భారీ వరదలతో బీబీపేట పెద్ద చెరువుకు బుంగపడింది. సమాచారం అందిన వెంటనే పరిస్థితిని తెలుసుకునేందుకు నీటి పారుదల శాఖలో బీబీపేట ఏఈగా పనిచేస్తున్న రవళిక వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉండి తాత్కాలిక మరమ్మతులను పరిశీలించారు.

సహాయక చర్యల్లో ఆర్డీవో వీణ...