హైదరాబాద్‌కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు

Aug 7 2025 7:28 AM | Updated on Aug 7 2025 9:44 AM

హైదరా

హైదరాబాద్‌కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు

మద్నూర్‌(జుక్కల్‌): తమ పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ మద్నూర్‌, డోంగ్లీ మండలాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి తరలివెళ్లారు. ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత సురేష్‌ గొండ మాట్లాడుతూ.. భోజన నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్టు

లింగంపేట(ఎల్లారెడ్డి): పెండింగ్‌ బిల్లుల సాధన కోసం బుధవారం హైదరాబాదుకు వెళ్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను లింగంపేటలో అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతి యుతంగా నిరసన తెలపడానికి చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడితే తమను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కిష్టయ్య, శ్రీరామ్‌, లక్ష్మీబాయి ఉన్నారు.

హైదరాబాద్‌కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు 1
1/1

హైదరాబాద్‌కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement