
క్రీడలతోనే మానసికోల్లాసం
నిజామాబాద్ నాగారం: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, క్రీడల ద్వారానే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇందూర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఇందూర్ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నాయకులు ఎర్రం సుదీర్, నాగోళ్ళ లక్ష్మినారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు.