
బకాయి రుణాల వసూళ్లపై దృష్టి సారించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యుల వద్ద పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్ సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన వీవోఏలతోపాటు సీసీలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో సీ్త్రనిధి రుణాలకు సంబంధించి 87 శాతం బకాయిలు ఉన్నాయన్నారు. వీటితోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఈ యేడు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.37కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.7 కోట్లు ఇచ్చారని చెప్పారు. గ్రామాల్లో వృద్ధుల, వికలాంగుల, కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు బేస్త శాంత, అకౌటెంట్ రాజు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.