
తోరణాలు కావవి.. మొక్కజొన్న జోళ్లు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బెజుగంచెరువుతండాలో ఓ రైతు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న జోళ్లు చూడడానికి చక్కని తోరణాల మాదిరిగా కనిపిస్తున్నాయి. గత రబీ సీజన్లో సాగుచేసిన మొక్క జొన్న దిగుబడులను రాబోయే కాలంలో తినడానికి పురుగుపట్టకుండా నిల్వ చేసుకోవడానికి ఇంటి ముందు ఇలా జోళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్న గింజలకు పురుగు పట్టకుండా ఉంటుందని గిరిజన రైతు రమావత్ కిషన్‌నాయక్ తెలిపారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో తాము వాటిని పిండిగా మార్చుకొని రొట్టెలు చేసుకుంటామని ఆయన చెప్పారు.