
మహిళల స్వయం ఉపాధికి రోటరీ కృషి అభినందనీయం
కామారెడ్డి అర్బన్: మహిళల స్వయం ఉపాధికి రోటరీ క్లబ్, పీపుల్ ఫర్ ఇండియా సంస్థ ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో దాదాపు రూ.4 లక్షల విలువైన ఎంబ్రాయిడరీ మిషన్, రూ.50 వేల విలువైన తాటిపత్రిలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, రోటరీ ప్రతినిధులు శంకర్, కృష్ణహరి, ప్రొగ్రాం చైర్మన్ రాజనర్సింహారెడ్డి, వెంకట రమణ, గర్గుల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలిమి భీంరెడ్డి, నవీన్‌కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.