
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ స్వప్న తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు నిందితులు పట్టుబడగా వారు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మునావర్, మహమ్మద్ ఇర్ఫాన్, అమీర్ పాషా, నిజామాబాద్‌లోని ముజాయిత్‌నగర్‌కు చెందిన అన్వర్‌గా పోలీసులు గుర్తించారు. కారులో రెండు కిలోల వంద గ్రాముల ఎండు గంజాయి లభించిందని అన్నారు. నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఎస్సైలు రామ్‌కుమార్, చారి, సిబ్బంది హమీద్, శివ, రాజన్న, భోజన్న, ఆశన్న, రాంబచన్, సాయిప్రసాద్ పాల్గొన్నారు.