బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ప్రతి రోజు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు అందరు కృషి చేయాలని కోరారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ రాగిణిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రాగిణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రాఖీలు కట్టారు. సోదరీ, సోదరుల అనుబంధ గురించి వివరించారు. ఏబీవీపీ నాయకులు పవన్, దత్తారెడ్డి, అల్తాఫ్, సంజయ్, అంజి, విష్ణు, కృష్ణ, శ్రీకాంత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మకత సదస్సు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో బుధవారం గ్రామీణ విశ్లేషణాత్మకత సదస్సును నిర్వహించారు. మహాజ్యోతిబాపూలే ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, కరీంనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పలు కార్యక్రమాలను చేపట్టారు. సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, టైంలైన్, ట్రాన్సాక్ట్‌వాక్, సీజ నాలిటీ చార్టు వంటి పద్ధతుల ద్వారా గ్రామ వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేశారు. రైతుల జీవన శైలి, గ్రామవనరులపై సమాచారాన్ని సేకరించారు. విద్యార్థులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను బుధవారం తహసీల్దార్ సువర్ణతో కలిసి ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల ప్రారంభించారు. నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలన్నారు. పనులకు రూ.12లక్షల ఎస్‌డీఎఫ్ నిధులను కేటాయించామన్నారు. నాయకులు పాల్త్య విఠల్, రాము, మాజీద్, కంది మల్లేష్, తదితరులు ఉన్నారు.
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
భిక్కనూరు: మండల కేంద్రంలో దోమల తీవ్రత ఎక్కువ ఉన్నందున నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డికి ఆర్టీఐ ప్రతినిధి రవీందర్ వినతి పత్రం సమర్పించారు. ఆర్టీఐ ప్రతినిధులు కర్నాల శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులున్నారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి