
అప్పు చేసి పప్పు కూడు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): విద్యార్థుల హాజరును మెరుగుపర్చాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. బిల్లులు సకాలంలో అందకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి పిల్లలకు భోజనం వడ్డించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 532 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 975 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పని చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 1 నుంచి 5వ తరగతి వరకు రూ.6.78 .. 6, 7, 8 తరగతులకు రూ.10.17.. 9,10 తరగతులకు ఒక్కో విద్యార్థికి(గుడ్డుతో కలిపి) రూ.11.17 అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు..
సకాలంలో అందని బిల్లులు
మధ్యాహ్న భోజన ఏజెన్సీ
నిర్వాహకులకు తప్పని ఇబ్బందులు
అందాల్సిన బకాయిలు రూ.3 కోట్లు