
అద్దె బిల్లులు రాలేదు..
ప్రభుత్వ అధికారుల వద్ద నడిపే వాహనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ హైర్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారుల వద్ద అద్దె విధానంలో వాహనాలు పెట్టుకుని నడిపిస్తున్నామని తెలిపారు. దాదాపు 15 నెలలకు సంబంధించి రూ.40 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. 2023 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో సంతోషి ట్రావెల్స్ నుంచి ఏర్పాటు చేసిన వాహనాలకు సంబంధించిన మరో రూ.6.28 లక్షల డబ్బులు ఇంకా రాలేదన్నారు. బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.