
వేల ఎకరాల్లో అడవుల ఆక్రమణ..
గాంధారి మండలంలో వేల ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయని మండలంలోని పెద్ద గుజ్జుల్ తండాకు చెందిన గిరిజన నాయకుడు నెనావత్ మోజీరాం నాయక్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా గాంధారి మండలంలో అడవులు ఉండేవన్నారు. తాము కూడా గిరిజనులం అంటూ లబానా లంబాడాలు మండలంలోని వేల ఎకరాల అడవులను చదును చేసి ఆక్రమిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో తమకు కూడా పోడు పట్టాలు వస్తాయని భావిస్తూ యధేచ్ఛగా అడవుల నరికివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదంతా నిత్యం అటవీ అధికారుల కళ్ల ముందరే జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటవీ భూముల సమగ్ర సర్వే చేపట్టి లబానాల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని గిరిజనులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.