
హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని ముత్యాల పోచమ్మ అమ్మవారికి ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా మహిళలు ఘనంగా బోనాల పండగను నిర్వహించారు. అమ్మవారికి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బీబీ పాటిల్, పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డిలు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. పండుగలో భాగంగా బోనాలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించారు. విజయవాడ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అమ్మవార్ల వేషధారణతో డ్యాన్సులు చేశారు. హైదరాబాద్ యువతులు చేసిన డ్యాన్సులు అలరించాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఎల్లారెడ్డి హోరెత్తింది.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. బందోబస్తును సీఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట ఎస్సైలు మహేష్, దీపక్‌కుమార్ తదితరులు పర్యవేక్షించారు.

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం

హోరెత్తిన ఎల్లారెడ్డి పట్టణం