
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాద పరిషత్ సభ్యులు
నిజామాబాద్ లీగల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా న్యాయవాద పరిషత్ సభ్యులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. యువ న్యాయవాదులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యం పెంచుకొని వృత్తిలో ముందుకు సాగాలని సూచించారు. న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌గౌడ్, ఉమ్మడి జిల్లా న్యాయవాదులు సంతోష్ శర్మ, భార్గవ్ భూపాల్, గంగరాజు, విఠల్ రావు, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు.