
గంజాయి పట్టివేత
బోధన్ టౌన్: పట్టణంలోని ఆచన్‌పల్లి బైపాస్‌రోడ్‌లో ఆదివారం రాత్రి కార్తిక్ అనే యువకుడి నుంచి 19 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బైపాస్ రోడ్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. యువకుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని విచారించగా రెంజల్ బేస్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేశాడన్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
వృద్ధుడి అదృశ్యం
ఖలీల్‌వాడి: నగరంలోని శివాజీనగర్‌కు చెందిన దాసరికిషన్(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీనగర్‌కు చెందిన దాసరి కిషన్ ఈనెల 18న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కిషన్ కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.