
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గూపన్‌పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగన్న అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సాయంత్రం నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్ హాజరై పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగన్న అకాల మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అన్నారు.
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అంత్యక్రియల్లో పార్టీ జిల్లా నాయకులు బాగిర్తి బాగారెడ్డి, లింగం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయండి
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి కోరారు. సీఎం హైదరాబాద్‌లోని తన నివాసంలో సునీల్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జాబితా అందించారు. దీనికి స్పందించిన సీఎం నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.
అదుపుతప్పి బోల్తాపడిన లారీ
పెద్దకొడప్‌గల్: మండలంలోని బేగంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఆదివారం ఉదయం వేకువజామున హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీ బేగంపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం