
అ‘పూర్వ’ సమ్మేళనం
కామారెడ్డి టౌన్/ భిక్కనూరు: జిల్లా కేంద్రంలోని ప్రగతి హైస్కూల్‌లో పదో తరగతి చదివిన 1996–97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే గర్గుల్ ఉన్నత పాఠశాల 1980–81 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. చిన్ననాటి స్నేహితులు ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990–91 పదో తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గురువులు పాల్గొన్నారు.
గర్గుల్ 1980–81 పూర్వ విద్యార్థులు
పెద్దమల్లారెడ్డిలో 1990–91 పూర్వ విద్యార్థులు

అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం