
‘రాజ్యాధికారమే బీసీల అంతిమ లక్ష్యం’
రామారెడ్డి(ఎల్లారెడ్డి): రాజ్యాధికారమే బీసీల అంతిమ లక్ష్యం కావాలని మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రతినిధి మంగిళిపల్లి శంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రం రామారెడ్డిలోని గంగపుత్ర సంఘ భవనంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో బీసీలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.
మంగళిపల్లి శంకర్ మాట్లాడుతూ.. బీసీలంతా ఏకతాటిపై వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలను మోసం చేసి అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తున్నాయని మండిపడ్డారు. వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. నేతలు సిరివెరు శంకర్, పూస రవి, దువ్వల శ్రీకాంత్, పిప్పరి లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.