
విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి
మోపాల్: విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిర్వాహకులకు సూచించారు. మోపాల్ మండలంలోని కంజర్ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు, వంట నూనె ఇతర వంట సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య స్థి తిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆ రా తీశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి