
మొరం టిప్పర్ల పట్టివేత
డిచ్‌పల్లి: అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కాలేజ్ సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం టిప్పర్లను డిచ్‌పల్లి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అధికార పార్టీకి చెందిన వాహనాల యజమాని టిప్పర్లను విడిపించుకునేందుకు జిల్లా స్థాయి నాయకులతో ఫైరవీలు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. స్థానిక పోలీసులకు బదులు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు టిప్పర్లను పట్టుకోవడంతో వాటిని విడిపించుకోలేక పోయినట్లు తెలుస్తోంది.