
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు అఖిల్‌రావు అన్నారు. తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం యూత్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో తెలిపాలని, అర్హులైన వారందరికి పథకాలు అందేలా చూడాలన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు సతీష్, రంజిత్, దయాకర్, ప్రవీణ్, మహిపాల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.