
జాతీయ ఓబీసీ మహాసభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అర్‌అండ్‌బీ అతిథి గృహంలో జాతీయ ఓబీసీ మహాసభల వాల్ పోస్టర్లను సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివరాములు మాట్లాడుతూ.. ఆగష్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 10 వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారన్నారని తెలిపారు. ఈ మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. నేతలు నాగరాజు, భూమన్న, మోహనాచారి, నాగోజి నారాయణరావు, హాజీ అబ్దుల్ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.